పోషణ మాసం..ఆరోగ్య రక్షణ లక్ష్యం

తిరుమలగిరి 06 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ తిరుమలగిరి మండలంలోని గుండెపూరి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీలు, బాలింతలు, కిశోర బాలికలతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐసీడీఎస్ సూపర్‌వైజర్ కైనీరుస హాజరై మాట్లాడుతూ పౌష్టికాహారం, ఆరోగ్య పరిరక్షణ, పరిశుభ్రత, సమతుల్య ఆహారంపై అవగాహన కల్పించారు. అనంతరం చిన్నారులకు అన్నప్రాసన చేశారు చిన్నారుల శారీరక, మానసిక ఎదుగుదలకు పౌష్టికాహారం ఎంతో కీలకమని, పిల్లలకు రోజువారీ ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు, పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, పాలు, గుడ్లు తదితర పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను అందించాలని సూచించారు. పిల్లల ఎదుగుదలను ఎప్పటికప్పుడు గమనిస్తూ, వయస్సుకు తగిన ఆహారం అందించాల్సిన అవసరం ఉందన్నారు.గర్భిణీలు, బాలింతలు...