పట్టపగలే చోరీ.. బంగారం, నగదు అపహరణ
ఇంట్లో ఎవరూ లేని సమయంలో చొరబడిన దొంగ.. బైక్ వదిలి పరార్. జోగులాంబ గద్వాల 5అక్టోబర్ 26 తెలంగాణ వార్తా ప్రతినిధి. ధరూర్. మండల పరిధిలోని పెద్ద చింతరేవుల గ్రామంలో పట్టపగలే చోరీ చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన తంబాళి నాగరాజు ఇంట్లోకి గుర్తుతెలియని దొంగ చొరబడి బంగారు ఆభరణాలు, నగదును అపహరించినట్లు సమాచారం.స్థానికుల సమాచారం మేరకు ఇంట్లోకి ప్రవేశించిన దొంగ సుమారు రెండు తులాల బంగారు ఆభరణాలతో పాటు రూ.90 వేల నగదును ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. చోరీ జరుగుతున్న సమయంలో స్థానికులు అక్కడికి రావడాన్ని గమనించిన దొంగ భయంతో అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం.పారిపోయే క్రమంలో దొంగ తన వెంట తెచ్చుకున్న బైక్ను ఇంటి ముందే...