క్షేత్రస్థాయిలో పింఛన్ల పరిశీలన లో అదనపు కలెక్టర్ నర్సింగరావు
జోగులాంబ గద్వాల 5 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి. గద్వాల. మండలం పరిధిలోని కొండపల్లి గ్రామంలో దివ్యాంగుల పింఛన్లకు సంబంధించి జిల్లా స్థాయి ధ్రువీకరణ కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ నర్సింగరావు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సోమవారము గ్రామంలోని అర్హత గల లబ్ధిదారులను క్షేత్రస్థాయిలో పరిశీలించి విచారణ కొనసాగించారు. ఈ సందర్భంగా అర్హులైన దివ్యాంగులకు ప్రభుత్వ పింఛన్లు అందేలా ధ్రువీకరణ ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు సూచించారు. పింఛన్లకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శైలజ, పంచాయతీ కార్యదర్శులు మరియు సంబంధిత సిబ్బంది పాల్గొన్నరు.