పోలీసు ఉద్యోగ ఆశావహులకు 45 రోజుల ఉచిత శిక్షణకు అభ్యర్థుల ఎంపిక పరీక్ష.
జిల్లాలోని 4 పరీక్షా కేంద్రాల్లో హాజరైన 1220 మంది యువత. సూర్యాపేట పట్టణంలో ఎస్వీ డిగ్రీ కళాశాలలో ఎంపిక పరీక్ష సరళి పరిశీలించిన జిల్లా ఎస్పీ కె. నరసింహ. సూర్యాపేట:- ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు సూర్యాపేట జిల్లా యంత్రాంగం, జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో అందించనున్న 45 రోజుల ఉచిత శిక్షణలో అభ్యర్థుల ఎంపిక కోసం ఆదివారం ఎంపిక పరీక్ష నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 4 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించారు. సూర్యాపేట ఎస్వీ డిగ్రీ కళాశాల, కోదాడ కేఆర్ఆర్ డిగ్రీ కళాశాల, హుజూర్నగర్ గ్రీన్వుడ్ పాఠశాల, తిరుమలగిరి జిల్లా పరిషత్ పాఠశాలలలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి పరీక్ష నిర్వహించారు. సూర్యాపేట...