అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడాలి
యుద్దం మానవ జాతి ని నాశనం చేస్తుంది అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం రాష్ట్ర సమన్వయ ప్రధాన కార్యదర్శి కేవిఎల్ పిలుపు.... suryapet:-యుద్దం వలన మానవాళికి అంతులేని నష్టం జరుగుతుందని యుద్ధం వలన ప్రాణహానితోపాటు భవిష్యత్ తరాలు తీవ్రంగా దెబ్బతింటాయని అఖిలభారత సంఘీభావ సంఘం రాష్ట్ర సమన్వయ ప్రధాన కార్యదర్శి ప్రముఖ న్యాయవాది కె.వి.ఎల్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని బ్రహ్మాండపల్లి ప్రభాకర్ ఫంక్షన్ హాల్ లో జిల్లా నాలుగో మహాసభలో పాల్గొని మాట్లాడుతూ వ్యక్తి ఆలోచన మూలంగానే శాంతి గాని యుద్ధం గాని వస్తాయని, చెడు ఆలోచన అనేది ప్రపంచాన్ని వేరు చేస్తుందని ఆయన అన్నారు. సామ్రాజ్యవాదం కాంక్షతో అమెరికా వంటి దేశాలు...