తండ్రి బాటలోనే తనయుడు

తిరుమలగిరి 04 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ అర్వపల్లి శ్రీ యోగనందా లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో శనివారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించి, నల్లగొండ–ఖమ్మం–వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం, ఓటరు నమోదు ప్రక్రియను ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి అనంతరం విలేఖరులతో మాట్లాడారు.తమ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీతో నాలుగు తరాలుగా అనుబంధం ఉందని, ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో తమ కుటుంబానికి సుదీర్ఘ సంబంధాలు ఉన్నాయని సర్వోత్తమ్ రెడ్డి తెలిపారు. తనకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం కల్పించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి, తన అభ్యర్థిత్వాన్ని బలపరిచిన మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులకు ఆయన కృతజ్ఞతలు...