చిట్టీలు, అధిక రాబడి పేరుతో కోట్ల రూపాయలు వసూళ్లు – ఇద్దరు అరెస్ట్

చివ్వెంల పోలీస్ స్టేషన్ పరిధిలో చిట్టీలు, డెయిలీ కలెక్షన్లు, అధిక రాబడుల పేరుతో ప్రజల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి మోసానికి పాల్పడిన దానిపై చివ్వెంల పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేసి ఈ కేసులో ప్రభుత్వ ఉపాధ్యాయుడు అతని భార్యను చివ్వెంల పోలీసులు అరెస్ట్ చేశారు. సూర్యాపేట డివిజన్ డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ ప్రసన్న కుమార్ కేసు వివరాలు, నిందితుల అరెస్ట్ వివరాలను వెల్లడించారు. ఈ సమావేశంలో సూర్యాపేట రూరల్ సీఐ జి. రాజశేఖర్, చివ్వెంల ఎస్‌ఐ వి. మహేష్, ఎస్ఐ వెంకన్న పాల్గొన్నారు. చివ్వెంల మండలం యెనగండి తండాకు చెందిన బానోత్ రాజు (44), ప్రభుత్వ...