గాంధీ ఆశయాలను ఆచరించడమే నిజమైన నివాళి
తిరుమలగిరి 03 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ తిరుమలగిరి మండల వ్యాప్తంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, మున్సిపాలిటీ కార్యాలయం మార్కెట్ యార్డు గ్రామ పంచాయతీలు, ఇతర సంస్థల్లో అధికారులు, ప్రజా ప్రతినిధులు, సిబ్బంది గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గాంధీజీ దేశ స్వాతంత్ర్యం కోసం చేసిన పోరాటాన్ని, ఆయన అనుసరించిన అహింస, సత్యం, శాంతి, స్వచ్ఛత వంటి విలువల ను పలువురు గుర్తు చేసుకున్నారు. ప్రజలందరూ గాంధీజీ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సమాజ అభివృద్ధికి తమ వంతు బాధ్యతగా పనిచేయాలని...