వీధి కుక్కలతో బెబ్బెలెత్తుతున్న ప్రజలు

తిరుమలగిరి 03 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ మండల వ్యాప్తంగా గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో కుక్కలు ప్రజలను తీవ్రభయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. నగరం, పట్టణం, గ్రామం అనే తేడా లేకుండా గుంపులు, గుంపులుగా రోడ్లపై తిరుగుతూ చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధులు, సైకిల్‌, ద్విచక్రవాహనదారులను వెంబడించి పరుగుపెట్టిస్తున్నాయి. వీధికుక్కల స్వైర విహారంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. రాత్రివేళల్లో రోడ్లపైకి గుంపుగుంపులుగా వచ్చి రోడ్లపై నుంచి వెళ్ళే వారిపై దాడులు చేస్తుండడంతో కుక్కలు కనబడితే చాలు తీవ్రభయాందోళనకు గురవుతున్నారు. ప్రతిరోజు మండలంలో ఎక్కడో ఒక చోట వీధి కుక్కల బారిన పడి గాయపడిన సంఘటన జరుగుతూనే ఉంది. ఏదైనా సంఘటన జరిగినప్పుడే స్పందించే అధికారులు తరువాత పట్టించుకోవడం లేదని...