జోగులాంబ గద్వాల జిల్లాను తక్షణమే కరువు జిల్లాగా ప్రకటించాలి

ముఖ్యమైన పాయింట్స్:బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్. రామచంద్ర రెడ్డి జోగులాంబ గద్వాల 2 అక్టోబర్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- గద్వాల జిల్లాను తక్షణమే కరువు జిల్లాగా ప్రకటించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్. రామచంద్ర రెడ్డి డిమాండ్ చేశారు. బీజేపీ అయిజ మండల అధ్యక్షుడు గోపాలకృష్ణ ఆధ్వర్యంలో అయిజ మండలంలోని ఎక్లాస్‌పురం, దేవబండ, బింగిదొడ్డి గ్రామాల్లోని ఎండిపోయిన పంట పొలాలను వారు పరిశీలించి, రైతుల దయనీయ స్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్. రామచంద్ర రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో గత నాలుగు మాసాలుగా పూర్తి వర్షాకాలంలోనూ వర్షపాతం అత్యంత లోటుగా నమోదైనట్లు ఐఎండీ స్పష్టం చేసిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సగటున 17...