పీఎం సూర్య ఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

ముఖ్యమైన పాయింట్స్:సబ్సిడీతో సోలార్ ప్లాంట్స్ ఏర్పాటుకు అవకాశం. జోగులాంబ గద్వాల 2 అక్టోబర్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- గద్వాల పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని విద్యుత్ శాఖ ఎస్ఈ అబ్దుల్ కరీం అన్నారు. పథకం ప్రచారానికై సేవా సేతు అభియాన్ పేరుతో గద్వాల విద్యుత్ శాఖ డివిజన్ కార్యాలయం వద్ద మూడు రోజులపాటు నిర్వహించు శిబిరాన్ని శుక్రవారం రెడ్కో, విద్యుత్ శాఖ అధికారులు ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎస్ఈ మాట్లాడుతూ ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీకి సోలార్ ప్లాంట్స్ ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తుంది అన్నారు. వినియోగదారులు తమ ఇంటి పైకప్పులపైనే ఈ...