గాంధీమార్గమే సమాజానికి స్ఫూర్తి ఎమ్మెల్యే సామేలు
తిరుమలగిరి 02 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ జాతిపిత మహాత్మాగాంధీ ప్రబోధించిన సత్యం, శాంతి, అహింసా మార్గాన్ని అనుసరించి మంచి సమాజాన్ని నిర్మించాలని ఎమ్మెల్యే మందుల సామెల్ అన్నారు తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహాత్మ గాంధీ 157 వ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గాంధీ అహింస మార్గంతోనే దేశానికి స్వాతంత్య్రం సాధించామని, ప్రతిఒక్కరూ మహాత్ముడిని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగినప్పుడే దేశం సర్వోన్నతి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు సుంకర జనార్ధన్ పేరాల వీరేష్ జుమ్మిలాల్ వార్డు కౌన్సిలర్స్ కవిత...