అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ కు 26000/- వేల వేతనం ఇవ్వాలి.

ముఖ్యమైన పాయింట్స్:ఉద్యోగ భద్రత కల్పించాలి. అంగన్వాడీ లకు దసరా సెలవులు ఇవ్వాలి Suryapet Rural:- దురాజుపల్లి సెక్టార్ లో యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు వెంపటి. గురూజీ,యూనియన్ జిల్లా అధ్యక్షురాలు తాటిపాముల. నాగలక్ష్మి లు అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ సమస్యల గురించి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన మూడు సంవత్సరాలు కావస్తున్న అంగన్వాడీలకు వేతనాలు పెంచకుండ నిర్లక్ష్యం చేయడం మోస పూరిత విధానం అని అన్నారు. అధికారం లోకి వస్తే 26000/- వేతనం ఇస్తామని వాగ్దానం చేశారని, చేసిన వాగ్దానం గంగ లో కలిపారని అన్నారు.ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ప్రీ ప్రైమరీ తీసుకొచ్చి అంగన్వాడీ సెంటర్స్ కు...