వైద్య విద్యను అభ్యసించాలి ప్రజలకు సేవ చేయాలి
తిరుమలగిరి 01 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:- విద్యార్థినిలు పట్టుదలతో వైద్య విద్యను అభ్యసించి సమాజానికి సేవ చేయాలని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం తిరుమలగిరి అధ్యక్ష, కార్యదర్శులు ఎస్ విటల్ రెడ్డి, బి నర్సయ్య కోరారు. బుధవారం పెన్షనర్స్ భవన్ తిరుమలగిరిలో 2026 నీట్ లో ఎంబిబిఎస్ సీట్లు సాధించిన జలాల్ పురం గ్రామానికి చెందిన ముత్తినేని వైష్ణవి రిమ్స్ ఆదిలాబాద్, జేత్యా తండాకి చెందిన ధరావత్ అలేఖ్య ప్రభుత్వ మెడికల్ కాలేజ్ వనపర్తిలను శాలువా, మెమోంటోలచే ఘనంగా రిటైర్డ్ ఉద్యోగుల సంఘం తిరుమలగిరి మండల శాఖ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు విటల్ రెడ్డి చెరో పది వేలు ఆర్థిక సహాయం...