ఎల్ఆర్ఎస్ ను సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో నిరంతరం కొనసాగించాలి

నాలా కన్వర్షన్ మీద ఫ్లాట్ నెంబర్లు వేసి రిజిస్ట్రేషన్లు చేయాలి. నూతన సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు నిర్మించాలి. రిజిస్ట్రేషన్ కార్యాలయాలలో మౌలిక వసతులు కల్పించాలి. తెలంగాణ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్ . సూర్యాపేట, సెప్టెంబర్ 30. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఎల్ఆర్ఎస్ విధానాన్ని నిరంతరం కొనసాగించాలని తెలంగాణ రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం ఇటీవల ఎల్ఆర్ఎస్ ను సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో నిలిపివేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. పాత పద్ధతిలోనే ఎల్ఆర్ఎస్ ను నిరంతరం...