క్లాస్రూమ్ నుంచి కార్పొరేట్ వరకు వ్యవసాయ క్షేత్రం నుంచి ప్రజా జీవితంలోకి
రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి అభ్యర్థిత్వం ప్రత్యేక నేపథ్యంతో కూడిన ఎంపిక గూడేపు నాగరాజు అడ్డగూడూరు 30 సెప్టెంబర్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:- నల్లగొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో ఆయన విద్యా ప్రస్థానం,అంతర్జాతీయ వృత్తిఅనుభవం,వ్యవసాయ–వ్యాపార రంగాల్లో అనుభవం,రాజకీయ జీవితాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గూడపు నాగరాజు ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటన ప్రకారం, ఈ అభ్యర్థిత్వానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదం తెలిపారు.“ఒక నాయకుడి ప్రయాణం కేవలం రాజకీయ వేదికతోనే కొలవలేం.విద్యలో సాధించిన ప్రావీణ్యం,అంతర్జాతీయ సంస్థల్లో పొందిన అనుభవం, వ్యవసాయ రంగంతో అనుబంధం,ప్రజా జీవితంలో పనిచేసిన అనుభవం—ఈ అన్ని కోణాలు కలిసిన వ్యక్తిత్వం...