రాష్ట్ర స్థాయి సైన్స్ సెమినార్‌లో ఎర్రవల్లి శ్రీ సరస్వతి విద్యార్థిని ప్రతిభ

జోగులాంబ గద్వాల 30 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి. ఎర్రవల్లి. మండల కేంద్రంలోని: ఎర్రవల్లి శ్రీ సరస్వతి ఇంటర్నేషనల్ స్కూల్ (CBSE) కు చెందిన 9వ తరగతి IIT Advanced విద్యార్థిని ఎస్.మేధ శ్రీ రాష్ట్ర స్థాయి సైన్స్ సెమినార్ ఫెస్టివల్–2026లో పాల్గొని పాఠశాలకు గర్వకారణంగా నిలిచారు. హైదరాబాద్‌లోని SCERT బ్లాక్‌లోని గోదావరి ఆడిటోరియంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సైన్స్ సెమినార్ ఫెస్టివల్–2026లో ఎస్.మేధ శ్రీ జోగులాంబ గద్వాల జిల్లాకు ప్రాతినిధ్యం వహించారు. రాష్ట్ర స్థాయి వేదికపై సైన్స్ సెమినార్‌లో పాల్గొన్న ఆమెకు నిర్వాహకులు పాల్గొనిన ధ్రువీకరణ పత్రం (Participation Certificate) అందజేశారు. సెమినార్‌లో ఉత్సాహంగా పాల్గొని, తన శాస్త్రీయ ఆలోచనలను, ప్రతిభను ప్రదర్శించిన...