అన్నపురెడ్డిపల్లి మండలంలో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ అంకిత్
నరసాపురంలో భూ రీ సర్వే పరిశీలన. గురుకుల పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు రికార్డుల ఆధారంగా భూముల వివరాలను పక్కాగా నిర్ధారించాలి విద్యార్థుల భద్రత, ఆహార నాణ్యతలో రాజీ వద్దు ఫుడ్ పాయిజనింగ్కు తావులేకుండా పటిష్టమైన జాగ్రత్తలు తీసుకోవాలి అన్నపురెడ్డిపల్లి మండలంలో జిల్లా కలెక్టర్ అంకిత్ మంగళవారం విస్తృతంగా పర్యటించి భూ రీ సర్వే ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించడంతో పాటు, గురుకుల విద్యాసంస్థల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ముందుగా నరసాపురం గ్రామ పరిధిలో కొనసాగుతున్న భూ రీ సర్వే ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్, అనంతరం అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల, కళాశాల, తెలంగాణ గిరిజన సంక్షేమ బాలికల పాఠశాల, జూనియర్ కళాశాలను...