బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం నేరం – అసాంఘిక చర్య.
“బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం నేరం” అనే హెచ్చరిక బోర్డు ప్రతి వైన్‌షాప్ వద్ద ఏర్పాటు చేయాలి. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ ఇతరులకు ఇబ్బంది కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు. ....ఎస్పీ నరసింహ ఐపీఎస్ సూర్యాపేట జిల్లా పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం నేరమని, అది అసాంఘిక చర్యగా పరిగణించబడుతుందని జిల్లా ఎస్పీ నరసింహ హెచ్చరించారు. రోడ్ల పక్కన, కల్వర్టుల వద్ద, బహిరంగ ప్రదేశాల్లో, పాఠశాలలు, ఆట స్థలాలు, మైదానాలు, పార్కులు, ప్రజలు సంచరించే ప్రాంతాల్లో మద్యం సేవించడం వల్ల ప్రజలకు అసౌకర్యం కలగడంతో పాటు శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని అన్నారు. ముఖ్యంగా మద్యం సేవించి బహిరంగ ప్రదేశాల్లో గొడవలకు...