ఓట్ల చోరీ ఆరోపణలపై జ్ఞానేష్ కుమార్ను అరెస్టు చేయాలి
వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి. Suryapet Town:-ఓట్ల చోరీకి సంబంధించిన ఆరోపణలపై జ్ఞానేష్ కుమార్ను వెంటనే అరెస్టు చేసి, సమగ్ర విచారణ జరిపించాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బీజేపీ అనుకూల ఏకపక్ష వైఖరిని నిరసిస్తూ జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా కొప్పుల వేణారెడ్డి మాట్లాడుతూ.. ఓట్ల చోరీకి సంబంధించిన ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు నిర్వహించి వాస్తవాలను ప్రజల ముందుంచాలని కోరారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైనదని, ఓటర్ల హక్కులకు భంగం కలిగించే ఎలాంటి చర్యలైనా ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు....