వయోవృద్ధులకు సైబర్ భద్రత డిజిటల్ అక్షరాస్యతపై అవగాహన
జోగులాంబ గద్వాల 28 సెప్టెంబర్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:-గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రణామ్ వయోవృద్ధుల డే కేర్ సెంటర్లో వయోవృద్ధుల సంక్షేమం మరియు సాధికారత వారోత్సవ కార్యక్రమాల్లో భాగంగా సైబర్ భద్రత, డిజిటల్ అక్షరాస్యత మరియు వయోవృద్ధులపై వేధింపుల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా సంక్షేమ అధికారిని ( డి డబ్ల్యు ఓ ) డి.సునంద ముఖ్య అతిథిగా హాజరై వయోవృద్ధులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, గుర్తుతెలియని వ్యక్తులకు OTP, ATM/డెబిట్ కార్డు వివరాలు, బ్యాంకు ఖాతా వివరాలు, పాస్వర్డ్లు మరియు వ్యక్తిగత సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వెల్లడించరాదని...