ప్రజావాణి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి
ముఖ్యమైన పాయింట్స్:అదనపు కలెక్టర్ నర్సింగరావు, జోగులాంబ గద్వాల 28 సెప్టెంబర్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:-ప్రజావాణికి వివిధ సమస్యలపై వచ్చిన దరఖాస్తులను పెండింగ్ లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అదనపు కలెక్టర్ నర్సింగరావు అన్నారు. సోమవారం ప్రజావాణి సందర్భంగా ఐడిఓసి సమావేశపు మందిరంలో భూ సేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కృష్ణ, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు మనోజ్ కుమార్ రెడ్డి, రాజ్ కుమార్ తో కలిసి అదనపు కలెక్టర్ ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరించారు. ఈ వారం మొత్తం 65 ఫిర్యాదులు వచ్చాయన్నారు. సీఎం ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులను కూడా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రతి బుధవారం అన్ని శాఖల అధికారులు తమ సిబ్బందితో సమావేశాలు నిర్వహించి, ప్రజావాణి...