అక్షరాస్యత పెంచేందుకు అమ్మకు అక్షరమాల.

మహిళా సంఘాల సభ్యులందరూ చదువుకునేలా ప్రోత్సాహం. జిల్లాలో ఉల్లాస్ పరీక్షలు విజయవంతం. జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్. జోగులాంబ గద్వాల 28 సెప్టెంబర్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- గద్వాల జిల్లాలో అక్షరాస్యతను పెంచే దిశగా అమ్మకు అక్షరమాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో చదువుకున్న సభ్యుల సహకారంతో నిరక్షరాస్యులకు ప్రతిరోజు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. ఒక మహిళ అక్షరాస్యురాలు కావడం అంటే ఒక కుటుంబంలో కొత్త వెలుగు తీసుకురావడమేనని పేర్కొన్నారు. ఇంటి ఇల్లాలు చదువుకుంటే తమ పిల్లలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు కృషి...