ఆధార్ వ్యవస్థనే అబ్బురపరిచిన కవలలు!
వేలిముద్రలు, ఐరిస్ స్కాన్లు ఒకేలా.. డూప్లికేట్‌గా గుర్తించిన యూఐడీఏఐ సిస్టమ్ ఉమ్మడి నల్గొండ జిల్లా బ్యూరో, సెప్టెంబర్ 28:- డిజిటల్ యుగంలో ప్రతి పౌరుడికి ఆధార్ కీలక గుర్తింపుగా మారింది. వేలిముద్రలు, ఐరిస్ స్కాన్ల ఆధారంగా ప్రతి వ్యక్తికి ప్రత్యేక గుర్తింపును అందించే ఆధార్ వ్యవస్థకే ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌కు చెందిన పదో తరగతి కవలలు అరుదైన సవాలుగా నిలిచారు. ఖిజ్రా జుబేర్, తూబా జుబేర్ అనే కవల విద్యార్థినుల వేలిముద్రలు, ఐరిస్ స్కాన్లు ఒకేలా సరిపోవడంతో ఆధార్ వ్యవస్థ వారిలో రెండో వ్యక్తిని డూప్లికేట్‌గా గుర్తించిన ఘటన అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది. సాధారణంగా ఒకే రూపం కలిగిన కవలల్లోనూ వేలిముద్రలు, ఐరిస్ నమూనాల్లో స్వల్ప తేడాలు...