న్యాయవాదుల రక్షణకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకురావాలి
ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ (IAL)రాష్ట్ర అధ్యక్షులు బొమ్మగాని ప్రభాకర్ డిమాండ్ సూర్యాపేట న్యాయవాదుల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని, న్యాయవాదుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగినన్ని నిధులు కేటాయించాలని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ (IAL) రాష్ట్ర అధ్యక్షులు బొమ్మగాని ప్రభాకర్ (bommagani prabhakar) డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ధర్మ బిక్షం భవనంలో ఐ ఏ ఎల్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ తాళ్లపల్లి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ న్యాయవాదుల సంక్షేమం, వృత్తిపరమైన భద్రతకు ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరారు. ముఖ్యంగా వృత్తిలోకి కొత్తగా ప్రవేశిస్తున్న జూనియర్ న్యాయవాదులు...