అర్హులందరికీ ప్రభుత్వ సాయం అందిస్తాం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
పేదలకు కొండంత అండగా సీఎంఆర్‌ఎఫ్ హుజూర్‌నగర్ నియోజకవర్గంలో రూ.21.62 కోట్ల విలువైన చెక్కుల పంపిణీ 8 మండలాల్లోని 5,319 మంది లబ్ధిదారులకు ఆర్థిక భరోసా Huzurnagar:- తీవ్ర అనారోగ్యం, ఆపదలో ఉన్న నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) కొండంత అండగా నిలుస్తోందని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. హుజూర్‌నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ అనారోగ్య సమస్యలతో కార్పొరేట్, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందిన బాధితులకు మంజూరైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను ఆయన ఆదివారం లబ్ధిదారులకు అందజేశారు. నియోజకవర్గ పరిధిలోని 8 మండలాలకు చెందిన మొత్తం 5,319 మంది బాధితులకు దాదాపు రూ.21.62 కోట్ల విలువైన చెక్కులను పంపిణీ...