నిబంధనలు ఉల్లంఘించి డీజే వినియోగం. పోలీసు విధులకు ఆటంకం

ముఖ్యమైన పాయింట్స్:పెదవీడు గ్రామంలో డీజే సీజ్ చేసిన మట్టంపల్లి పోలీసులు – సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు. హుజూర్నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చరమందరాజు. హుజూర్ నగర్:- ఉత్సవాల నిర్వహణకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ ప్రజలకు అండగా ఉంటుంది, నిభందనలు ఉల్లంఘిస్తే చట్టపరంగా చర్యలు తప్పవు అని హుజూర్నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చరమందరాజు తెలిపారు. గణేశ్ నవరాత్రి ఉత్సవాలు, శోభాయాత్రలు, నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా, ప్రజా ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం, పోలీస్ శాఖ అధిక శబ్దాలు చేసే డిజేలు, చాలాసంచపై పూర్తిగా నిషేధం ఉన్నదని దీనిపై ప్రజలకు డివిజన్ నిర్వహణకు అవగాహన కల్పించి డీజే ఉపయోగించరాదని తెలియజేయడం జరిగిందని అన్నారు. గణేశ్ నిమజ్జన శోభాయాత్రల్లో డీజేలు,...