సూర్యాపేట జిల్లాలో ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటళ్లపై దాడులు..
సూర్యాపేట జిల్లా సెప్టెంబర్ 26:- సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆహార భద్రత ప్రమాణాల అమలుపై అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వి. జ్యోతిర్మయి ఆదేశాల మేరకు ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా 7 మిడ్వే ప్లాజా రాయగూడెం సూర్యాపేట, లిటిల్ విలేజ్ బిర్యానీ సూర్యాపేట మరియు అన్నపూర్ణ మెస్ లను తనిఖీ చేశారు. తనిఖీల్లో ఆహార తయారీ, నిల్వ ప్రాంతాల్లో పరిశుభ్రత ప్రమాణాలు సక్రమంగా పాటించకపోవడం, అపరిశుభ్రమైన పరిస్థితుల్లో ఆహార పదార్థాలను నిల్వ చేయడం వంటి పలు లోపాలను గుర్తించారు. ఆహార తయారీ ప్రాంతం, హోటల్ వంటగది, రిఫ్రిజిరేటర్లు కూడా సక్రమంగా శుభ్రపరచకపోవడంతో అపరిశుభ్ర, అస్వచ్ఛ పరిస్థితులు...