ప్రణామ్ వయోవృద్ధుల డే కేర్ సెంటర్ను సందర్శించిన
ముఖ్యమైన పాయింట్స్:జిల్లా సంక్షేమ అధికారి డి.సునంద వయోవృద్ధుల సంక్షేమం కోసం అందరూ కృషి చేయాలి - జిల్లా సంక్షేమ అధికారి సునంద. జోగులాంబ గద్వాల 26 సెప్టెంబర్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- గద్వాల జిల్లా కేంద్రంలోని రెండవ రైల్వే గేట్ సమీపంలో ఉన్న ప్రణామ్ వయోవృద్ధుల డే కేర్ సెంటర్ను జిల్లా మహిళా శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సాధికారిక సంక్షేమ శాఖ జిల్లా అధికారి సునంద శనివారం సందర్శించారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం–2026ను పురస్కరించుకుని ( సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 1 ) వరకు నిర్వహిస్తున్న వయోవృద్ధుల వారోత్సవాల్లో భాగంగా మూడవ రోజు కార్యక్రమంలో భాగంగా ఆమె డే కేర్ సెంటర్ను సందర్శించారు....