బాల్య వివాహాలు అరికట్టాలి లీగల్ సర్వీసెస్ అథారిటీ

అడ్డగూడూరు 26 సెప్టెంబర్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:-జిల్లా న్యాయసేవాధికార ఆదేశానుసారం మండల లీగల్ సర్వీస్ అథారిటీ (ఎంఎల్ఎస్సి) రామన్నపేట ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (డి)రేపాక స్కూల్ ఆవరణలో బాలల హక్కులపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ దంతూరి సత్తయ్య హాజరై ప్రసంగించారు. విద్యార్థులు బడిలో ఉన్నప్పుడే వారి హక్కులు రక్షింపబడతాయని పిల్లలే తమ నిజమైన సంపద మరియు దేశ సంపద అని తల్లిదండ్రులు గుర్తించినప్పుడే విద్యార్థుల భవిష్యత్తు ఉన్నతంగా తీర్చిదిద్ద టానికి అవకాశం ఉంటుందని అన్నారు. స్థానిక పాఠశాల హెచ్ఎం మండల విద్యాధికారి అడ్డగూడూరు ఎన్ సబిత అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఏజిపి...