ప్రత్యేక ప్రతిభావంతులకు అండగా ‘లీగల్ ఎయిడ్ క్లినిక్

కలెక్టరేట్ ఆవరణలో న్యాయ సహాయ కేంద్రం ప్రారంభం బాధితులు సద్వినియోగం చేసుకోవాలి: జడ్జి డా. శివరామ్ ప్రసాద్, కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ శారీరక, మానసిక, వైకల్యాలున్న ప్రత్యేక ప్రతిభావంతులకు చట్టపరమైన రక్షణ, ఉచిత న్యాయ సేవలు అందించడమే లక్ష్యంగా సూర్యాపేట కలెక్టరేట్ ఆవరణలోని జిల్లా సంక్షేమ కార్యాలయంలో లీగల్ ఎయిడ్ క్లినిక్ (న్యాయ సహాయ కేంద్రం) ఏర్పాటైంది. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాలు, స్కీమ్-2024 నిబంధనల మేరకు ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని ఫస్ట్ అడిషనల్ జిల్లా జడ్జి డాక్టర్ పి. శివరామ్ ప్రసాద్, జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (డీఎల్‌ఎస్‌ఏ) కార్యదర్శి...