సైబర్ మోసాల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి
- తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు, ఆన్లైన్ ఉద్యోగాలు, డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసాలు. - అపరిచితుల మాటలు నమ్మి డబ్బులు పంపితే ఆర్థిక నష్టం తప్పదు. – సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ సైబర్ నేరాలు రోజురోజుకూ కొత్త రూపాల్లో జరుగుతున్నందున ప్రజలు అత్యంత అప్రమత్తంగా, జాగ్రత్తగా వ్యవహరించాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ గారు ఒక ప్రకటనలో తెలిపారు. సైబర్ నేరగాళ్లు ప్రజలను నమ్మించేందుకు ఆకర్షణీయమైన పెట్టుబడి పథకాలు, ఆన్లైన్ ఉద్యోగాలు, వర్క్ ఫ్రమ్ హోమ్, డిజిటల్ అరెస్ట్ వంటి వివిధ పద్ధతులను ఉపయోగిస్తూ పెద్ద మొత్తంలో డబ్బులను కాజేస్తున్నారని తెలిపారు. తక్కువ పెట్టుబడి – ఎక్కువ లాభాలు అంటూ...