వయోవృద్ధుల గౌరవం సమాజం బాధ్యత

ముఖ్యమైన పాయింట్స్:జిల్లా ఎస్పీ టి శ్రీనివాసరావు అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా సమాచార సంచిక ఆవిష్కరణ వయోవృద్ధుల హక్కులు, రక్షణపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. జోగులాంబ గద్వాల 26 సెప్టెంబర్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:-అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం–2026 సందర్భంగా నిర్వహిస్తున్న వయోవృద్ధుల వారోత్సవాల్లో భాగంగా శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో వయోవృద్ధుల హక్కులు, రక్షణ, సంక్షేమానికి సంబంధించిన సమాచార సంచికను జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాస రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, వయోవృద్ధులను గౌరవించడం, వారి భద్రతకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని అన్నారు. వయోవృద్ధుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు,...