సుంకేసులకు 11 వేల క్యూసెక్కుల వరద.

జోగులాంబ గద్వాల 26 సెప్టెంబర్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- రాజోలి మండలం. కర్ణాటకలో కురిసిన వర్షాలతో రాజోలి సమీపంలోని సుంకేసుల జలాశయానికి వరద వస్తుంది. శనివారం ఉదయం 11 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో నమోదైనట్లు అధికారులు తెలిపారు. బ్యారేజీ 30 గేట్లు మూసివేసి కేసీ కెనాల్ కు 602 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. ఈ ఏడాది తొలిసారి వరద రావడంతో కర్నూలు కడప జిల్లాల రైతులతో పాటు తెలంగాణ నది తీరా గ్రామాల రైతులకు ఉపశమనం లభించింది.