సూర్యాపేట జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన గణేశ్ నవరాత్రి ఉత్సవాలు
పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు.. అన్ని శాఖల సమన్వయం.. ఉత్సవ కమిటీలు, ప్రజల సహకారం అభినందనీయం. - సహకరించిన ప్రతి ఒక్కరికీ జిల్లా పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు – జిల్లా ఎస్పీ నరసింహా ఐపీఎస్ సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలో వినాయకచవితి నుండి ప్రారంభమైన గణేశ్ నవరాత్రి ఉత్సవాలు, గణేశ్ మండపాల ఏర్పాటు, విగ్రహాల ప్రతిష్ఠాపన, నవరాత్రి ఉత్సవాలు, శోభాయాత్రలు మరియు నిమజ్జన కార్యక్రమాలు అత్యంత ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముగిశాయని జిల్లా ఎస్పీ కె. నరసింహా ఐపీఎస్ తెలిపారు. జిల్లా పోలీస్ శాఖ ముందస్తు ప్రణాళికతో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిందని అన్నారు. జిల్లా పోలీస్ శాఖతో పాటు రెవెన్యూ, మున్సిపల్,...