పెన్షన్‌కు లంచం డిమాండ్ ముగ్గురు ఉద్యోగులపై వేటు
ఫైలు ముందుకు కదలాలంటే ముడుపులు ఇవ్వాల్సిందేనంటూ వేధింపులు బాధితురాలి ఫిర్యాదుతో విచారణ జరిపించిన కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ ఎస్సీ అభివృద్ధి శాఖ సిబ్బంది సస్పెన్షన్ సూర్యాపేట, 25 సెప్టెంబర్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- పదవీ విరమణ పొందిన తోటి ఉద్యోగిణి పింఛను ప్రతిపాదనలు పంపడంలో నిర్లక్ష్యం వహించడంతో పాటు లంచం డిమాండ్ చేసిన ముగ్గురు ఉద్యోగులపై జిల్లా కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ కొరడా ఝళిపించారు. ఈ మేరకు సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, అటెండర్‌లను సస్పెండ్ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన అనంతరం ఈ చర్యలు తీసుకున్నారు. షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) అభివృద్ధి శాఖలో...