పండగలకే కాదు ప్రతిరోజూ కలిసి ఉండండి.

ఊరేగింపులోనే కాదు ఊరిలో ఏ సమస్య వచ్చినా ఊరంతా ఒక్కటవ్వండి - గణనాథుని సందేశం. జోగులాంబ గద్వాల 25 సెప్టెంబర్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- వినాయక చవితి సందర్భంగా ఇన్ని రోజులు పూజలు అందుకొని నేడు నిమర్జనానికి తరలి వెళ్లాయి ఈ 9 రోజులు మనతోనే ఉన్న బొజ్జ గణపయ్య... మన ఇంటి బిడ్డలా కొలువై, మన పూజలు అందుకుని, మన కోరికలు విని నిమజ్జనానికి బయలుదేరాడు. నీటిలో కరుగుతూ కూడా మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చి వెళ్తున్నాడు. నీటిలో మునిగిపోతున్న గణపయ్య "పండగలకే కాదు ప్రతిరోజూ కలిసి ఉండండి. ఊరేగింపులోనే కాదు ఊరిలో ఏదైనా సమస్య వచ్చినా ఊరంతా ఒక్కటవ్వండి.అందరూ కలిసి ఉండండి...