విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు
జోగులాంబ గద్వాల 25 సెప్టెంబర్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- ఇటిక్యాల & ఎర్రవల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇటిక్యాల డాక్టర్ రాధిక మరియు సూపర్వైజర్స్ ఎర్రవల్లి ఏఎన్ఎమ్స్ , ఆశా కార్యకర్తలు అందరూ కలిసి ఎర్రవల్లి లోని ఐజ గురుకుల స్కూల్ ను సందర్శించి (TGSWRS JC BOYS) 50 మంది విద్యార్థులకు ఆరోగ్య పరిక్షలు జరిపి మందులను పంపిణీ చేయడం జరిగింది, మరియు దగ్గు, జలుబు, కడుపు నొప్పి, విరోచనాలు, తలనొప్పి, జ్వరము మొదలగు చిన్నచిన్న ఆరోగ్య రుగ్మతలకు చికిత్స చేయడం జరిగినది. ఈ కార్యక్రమం ఎర్రవల్లి సర్పంచ్ అనిత కృష్ణ సాగర్ చేత ప్రారంభించడం జరిగినది. విద్యార్థులకు దోమల ద్వారా వచ్చే వ్యాధులు...