విధి నిర్వహణలో మృతి చెందిన పోలీసు కుటుంబానికి అండగా జిల్లా ఎస్పీ

కుటుంబ సభ్యులకు కార్పస్ ఫండ్ చెక్కులు అందజేసిన జిల్లా ఎస్పీ – సంక్షేమ ప్రయోజనాలు సకాలంలో అందేలా చర్యలు జోగులాంబ గద్వాల 25 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి. హార్ట్ స్ట్రోక్ కారణంగా తేది.22.12.2020 న మృతి చెందిన హెడ్ కానిస్టేబుల్ శ్యామప్ప కుటుంబ సభ్యులకు కార్పస్ ఫండ్ కింద జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాస రావు, ఐపీఎస్., శుక్రవారం చెక్కులను అందజేశారు. శ్యామప్ప కుటుంబానికి కార్పస్ ఫండ్ ద్వారా అందాల్సిన ఆర్థిక సహాయంలో భాగంగా, గత నెలలో రెండో భార్య మనోర, కుమారుడు తేజ లకు ఒక్కొక్కరికి రూ.12,450/- చొప్పున రెండు చెక్కులు అందజేయగా, ప్రస్తుతం మొదటి భార్య కుమారుడు పి.కె....