విద్యార్థులకు సమగ్ర ఆరోగ్య పరీక్షలు
జోగులాంబ గద్వాల 25 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి. గుంటిపల్లి పాఠశాలలో 100 మంది విద్యార్థులకు వైద్య పరీక్షలు. జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ ఆదేశాల మేరకు, DMHO- డా. సంధ్యా కిరణ్మయి. ఆధ్వర్యంలో ఆరోగ్య పాఠశాల కార్యక్రమంలో భాగంగ గద్వాల్ మండలం గుంటిపల్లి గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు సమగ్ర ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఉప్పేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెందిన వైద్యాధికారి డా. పి. రవికుమార్ విద్యార్థులకు రక్త పరీక్షలు, కంటి పరీక్షలు నిర్వహించారు. మొత్తం 100 మంది విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించగ, హిమోగ్లోబిన్ స్థాయిలు తక్కువగ ఉన్న విద్యార్థులకు అవసరమైన మాత్రలు అందజేశారు. విద్యార్థులు పౌష్టికాహారం తీసుకోవాలని,...