భూ సంబంధ దరఖాస్తులను పరిష్కరించాలి
రీ సర్వే పనులు వేగవంతం చేయాలి. జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్. జోగులాంబ గద్వాల 25 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి. భూ సంబంధ సమస్యలపై వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. రీ సర్వే, భూభారతి, సాదా బైనామా, తదితర రెవెన్యూ అంశాలపై శుక్రవారం జిల్లా కలెక్టర్ అన్ని మండలాల తహసిల్దార్లతో కలెక్టరేట్లోని తన ఛాంబర్ నుంచి వేబెక్స్ ద్వారా సమావేశమై మాట్లాడారు. రెవిన్యూ అంశాలపై చర్చించడానికి ఈ నెల 28న వనపర్తి లో జరిగే ఉమ్మడి జిల్లా స్థాయి సమావేశానికి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో...