వినాయకుని లడ్డూను కైవసం చేసుకున్న మైనారిటీ యువకుడు

జోగులాంబ గద్వాల 25 సెప్టెంబర్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- పట్టణం రాఘవేంద్ర కాలనీలో శివసేన యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం దగ్గర 11 రోజులు పూజలు అందుకున్న వినాయక స్వామి ప్రసాదం లడ్డు ను రాఘవేంద్ర కాలనీకి చెందిన మైనారిటీ యువకుడు మహమ్మద్ షఫి లడ్డూ వేలం పాటలో పాల్గొని 39900 రూపాయలకు లడ్డూను కైవసం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా వినాయక స్వామి దగ్గర ప్రతిష్టించిన కలశంను తెలుగు కృష్ణ కుమారుడు కిషోర్ 7777 రూపాయలకు వేలం పాట లో పాల్గొని కైవసం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కౌన్సిలర్ శ్రీరామలింగేశ్వర కాంళ్లే మాట్లాడుతూ రాఘవేంద్ర కాలనీలో శివసేన యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న...