ఎల్‌నినో ప్రభావం వలన నీటిని పొదుపుగా వాడుకోవాలి

కర్ణాటక సీఎం డి.కె. శివకుమార్‌తో మంతనాలు—సానుకూల స్పందన సాగు చేసిన పంటలను కాపాడతాం.. వేసవిలో మంచినీటి ఎద్దడి రానివ్వం రూ.26.93 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించిన రాష్ట్ర పౌరసరఫరాలు మరియు నీటిపారుదల శాఖ మాత్యులు నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న వేళ రైతులకు భరోసా కల్పించాల్సిన ప్రధాన బాధ్యత ప్రభుత్వం ఉన్నదని రాష్ట్ర పౌరసరఫరాలు మరియు నీటిపారుదల శాఖ మాత్యులు నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రకృతి కారణంగా ఏర్పడిన వర్షపాత లోటును కూడా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంగా చిత్రీకరిస్తూ బీఆర్ఎస్‌ నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆయన దుయ్యబట్టారు. రైతుల కష్టాన్ని రాజకీయ పెట్టుబడిగా మార్చుకోవడం బాధ్యతాయుత...