సూర్యాపేటలో అత్యధికంగా రూ.3 లక్షల 21 వేలు ధర పలికిన వినాయకుడి లడ్డు
గత 75 సంవత్సరాలుగా పూజలు అందుకుంటున్న శ్రీ వేదాంత భజన మందిరం వారు ఏర్పాటు చేసిన లడ్డు వేలంపాటలో సూర్యాపేట పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు బెలిదే శ్రీనివాస్ లు అత్యధికంగా మూడు లక్షల ఇరవై ఒక్క వెయ్యి రూపాయలకు వేలం పాటలో దక్కించుకున్నారు. గత ఏడాది రెండు లక్షల ఇరవై ఒక్క వెయ్యి లడ్డు వేలం కాగా ఈ సంవత్సరం లక్ష రూపాయలు అదనంగా వేలంపాట ద్వారా ఆలయానికి ఆదాయం చేకూర్చింది. శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పూల సెంటర్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ నివేదిత లక్షాది, ఎఐసిసి...