బీచుపల్లి ఆయిల్ మిల్లులో ఆయిల్‌పామ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు ఫ్యాక్టరీ లేఅవుట్ పరిశీలన
త్వరలో టెండర్ ప్రక్రియ పూర్తి చేసి ప్రాసెసింగ్ యూనిట్ పనులు ప్రారంభం జిల్లా ఉద్యాన శాఖ అధికారి రాజ్‌కుమార్ జోగులాంబ గద్వాల సెప్టెంబర్ 23 తెలంగాణ వార్త ప్రతినిధి. మండలం బీచుపల్లిలోని ఆయిల్ మిల్లులో ఆయిల్‌పామ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు సంబంధించి ఫ్యాక్టరీ లేఅవుట్‌ను ఖరారు చేసేందుకు టీజీ ఆయిల్‌ఫెడ్, హైదరాబాద్‌కు చెందిన సాంకేతిక బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించినట్లు జిల్లా ఉద్యాన శాఖ అధికారి రాజ్‌కుమార్ తెలిపారు. బుధవారం బీచుపల్లి ఆయిల్ మిల్లును టీజీ ఆయిల్‌ఫెడ్‌కు చెందిన టి. సుధాకర్ రెడ్డి, జే. సత్యనారాయణ మేనేజర్ మార్కెటింగ్, శ్రీకాంత్ రెడ్డి మేనేజర్ ప్లాంట్స్ అండ్ ప్రాజెక్ట్స్,ఆకుల బాలకృష్ణ మేనేజర్ టెక్నికల్ తదితరులతో కూడిన సాంకేతిక బృందం...