దసరాకు ముందే కొత్త పింఛన్లు..!
అక్టోబర్ నుంచే పంపిణీకి ప్రభుత్వం కసరత్తు.. అధికారులకు మంత్రి సీతక్క కీలక ఆదేశాలు హైదరాబాద్ | సెప్టెంబర్ 23 కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అక్టోబర్ నెలలో కొత్త పింఛన్ల పంపిణీని ప్రారంభించి, సాధ్యమైనంతవరకు దసరా పండుగకు ముందే అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లు అందించేలా చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. కొత్త పింఛన్ల కోసం వచ్చిన దరఖాస్తుల క్షేత్రస్థాయి పరిశీలనను వేగవంతం చేయాలని మంత్రి సూచించారు. వెరిఫికేషన్లో ఎలాంటి జాప్యం జరగకుండా అవసరమైన చోట అదనపు సిబ్బందిని వినియోగించుకోవాలని ఆదేశించారు. మొత్తం ప్రక్రియను పర్యవేక్షిస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్ అందేలా...