మట్టపల్లి కృష్ణా నది వద్ద గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలన ఎస్పి నరసింహ

బుధవారం జరగనున్న గణేష్ నిమజ్జన కార్యక్రమాలను పురస్కరించుకొని మఠంపల్లి మండలం మట్టపల్లి కృష్ణా నది వద్ద ఏర్పాటు చేసిన గణేష్ నిమజ్జన ప్రదేశాన్ని జిల్లా ఎస్పీ కె. నరసింహా సంబంధిత పోలీసు అధికారులు, ఇతర శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. నిమజ్జన కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో గణేష్ విగ్రహాలు, భక్తులు, వాహనాలు వచ్చే అవకాశం ఉన్నందున భక్తులకు ఎలాంటి ఇబ్బందులు, నిమజ్జనాలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ముందస్తు ప్రణాళికతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు. నిమజ్జన ప్రాంతంలో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, వాహనాల ప్రవేశం–నిష్క్రమణ మార్గాలను క్రమబద్ధీకరించాలని సూచించారు. నిమజ్జనానికి...