బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు అరెస్టుని తీవ్రంగా ఖండిస్తున్న

ముఖ్యమైన పాయింట్స్:జోగులాంబ గద్వాల జిల్లా బిజెపి అధ్యక్షులు రామాంజనేయులు .. జోగులాంబ గద్వాల 22 సెప్టెంబర్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- జూరాల ప్రాజెక్టు వద్ద నీళ్లు లేక ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షులు ఎన్ రాంచందర్ రావు ని జడ్చర్ల వద్ద పోలీసులు అడ్డుకుని, అదుపులోకి తీసుకోవడం అప్రజాస్వామికం. రైతుల కష్టాలను తెలుసుకునేందుకు వెళ్తుంటే మార్గమధ్యంలోనే అడ్డుకోవడం ఏంటి? ఇది ప్రభుత్వ దౌర్జన్యానికి, అధికార మదానికి నిదర్శనం... రైతుల పక్షాన బీజేపీ తెలంగాణ నిలబడుతుంది. అన్నదాతల గొంతుకై నిలుస్తాం. నిలదీస్తాం. రైతుల పొలాలకు సాగునీరు ఇవ్వాలని ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులకు పాల్పడటం కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి...