అర్హులైన దివ్యాంగులందరికీ సదరం ద్రవపత్రాలు: జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్

జోగులాంబగద్వాల 22 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి. జిల్లాలోని అర్హులైన దివ్యాంగులకు సదరం ధ్రువపత్రాలు మంజూరు చేసేందుకు, ధ్రువీకరణ ప్రక్రియను సులభతరం చేయడంతో పాటు వైద్య పరీక్షల కోసం ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సహకారంతో మంగళవారం గద్వాలలోని జిల్లా మహిళా సమాఖ్య కార్యాలయం వద్ద మానసిక సమస్యలున్న దివ్యాంగులకు నిర్వహిస్తున్న ప్రత్యేక మెగా సదరం శిబిరంను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అక్కడి వైద్యులు, అధికారులతో మాట్లాడి తగు సూచనలు చేశారు. అనంతరం మాట్లాడుతూ మానసిక వైకల్యంకు సంబంధించిన కేసులను ప్రత్యేకంగా...