సుంకరి కేశయ్య కు నివాళులర్పించిన ఎమ్మెల్యేలు

తిరుమలగిరి 22 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:- సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుంకరి జనార్దన్ పితృవియోగం చెందారు. ఆయన తండ్రి సుంకరి కేశయ్య శనివారం రోజున బొప్పరం గ్రామంలోని తన నివాసంలో అకాల మరణం చెందారు. ఈ విషయం తెలుసుకున్న తుంగతుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు మందుల సామెల్, నకిరేకల్ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ వేముల వీరేశం బొప్పరం గ్రామానికి చేరుకుని, కేశయ్య పార్థివదేహాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కేశయ్య భౌతికకాయంపై పూలమాలలు ఉంచి, వారు ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం మృతుని కుటుంబ సభ్యులను, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సుంకరి జనార్దన్‌ను పరామర్శించి, తమ గాఢ...